హైడ్రాపై హరీశ్ రావు సంచలన కామెంట్స్
హైడ్రాను రద్దు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.;

హైడ్రాను రద్దు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. చిన్న చిన్న బిల్డర్లు బలవన్మరణానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఆయన మీడియాతో మట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి భేషజాలకు పోకుండా హైడ్రాను రద్దు చేయాలని ఆయన కోరారు. బలవన్మరణానికి పాల్పడిన వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని హరీశ్ రావు పరామర్శించారు.
మరో బిల్డర్ కు ఇలాంటి...
హైదరాబాద్ లో మరో బిల్డర్ కు ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రా వల్లనే బిల్డర్లు బలవన్మరణానికి పాల్పడుతున్నారని తెలిపారు. తమ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం విస్తరించిందన్నారు. గత ఏడాది నుంచి ఈ రంగం కుదేలైపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని హరీశ్ రావు అన్నారు.