హైదరాబాద్ పై మరోసారి ఏపీ నేతల కుట్ర : హరీశ్ రావు

హైదరాబాద్ ను మరోసారి ఉమ్మడి రాజధానిగా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు;

Update: 2024-05-03 05:52 GMT

హైదరాబాద్ ను మరోసారి ఉమ్మడి రాజధానిగా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మాత్రమే కాదు కేంద్ర పాలిత ప్రాంతం కూడా చేసే కుట్రను ఏపీ నేతలు చేస్తున్నారని అన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని హరీశ్ రావు అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు...
కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టకుంటే రైతుల బతుకులు ఆగమయిపోతాయని అన్నారు. కాంగ్రెస్ శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను కూడా అమలు పర్చడం లేదన్నారు. ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వెళుతుందని చెప్పారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మవద్దని హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టి బీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలను కట్టబెడితే పార్లమెంటులో రాష్ట్ర హక్కుల కోసం పోరాడతామని తెలిపారు.

హైదరాబాద్ లో జరిగే ప్రతి సంఘటన మీకు చేరవేసే డిజిటల్ వార్త పత్రిక HyderabadMail.com


Tags:    

Similar News