సీఎంల భేటీపై వెంకయ్యనాయుడు ఏమన్నారంటే?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు;

Update: 2024-07-07 12:46 GMT

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. హైదరాబాదులో నిన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కావడంపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియచేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం శుభపరిణామం అని అభివర్ణించారు.

కీలక ముందడుగు...
ఇది కీలక ముందడుగు అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృత అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నానని ఆయన ఈ సందర్బంా ట్వీట్ చేశారు


Tags:    

Similar News