ఆదివారం హైదరాబాద్ లో భారీ వర్షం మంగళవారం వరకు వర్షాలే...

అదివారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎస్సార్ నగర్, అమీర్ పేట, రహమత్ నగర్, మోతి నగర్, బోరబండ, మదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్ ల్లో భారీ వర్షం పడింది.;

Update: 2023-09-03 08:40 GMT
hyderabad, heavy rains, rain alert, weather update
  • whatsapp icon

ఆదివారం హైదరాబాద్ లో భారీ వర్షం

మంగళవారం వరకు వర్షాలే...

అదివారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎస్సార్ నగర్, అమీర్ పేట, రహమత్ నగర్, మోతి నగర్, బోరబండ, మదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్ ల్లో భారీ వర్షం పడింది. ఉప్పల్, అంబర్ పేట, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, రామంతాపూర్, తర్నాక, సికింద్రబాద్, బేగంపేట, మెహదీపట్నాల్లో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్ల పైకి నీరు వచ్చింది. నీరు నిలిపోయిన చోట్ల జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం కావండతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాలేదు. వాహనాలు ఇప్పుడిప్పుడే రోడ్ల పైకి వస్తుండడంతో పలు చోట్ల స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షంతో పలు చోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. గత 15 రోజులు తీవ్ర ఉక్కపోత బాధపడుతున్న హైదరాబాద్ ప్రజలకు ఈ వర్షం ఊరట కలిగించింది. భారీ వర్షంతో హైదరాబాద్ లో ఉష్ణోగ్రత తగ్గింది.

విదర్భ నుంచి కర్ణాటక వరకు ఒక ద్రోణి, దక్షిణ చత్తీస్ గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర 4.5 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవనలు దక్షణాదికి వచ్చాయి. దీంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని చాలా వర్షాలు కురిశాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు తెలంగాణాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, కొత్తగూడెం, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో ఉరుమురులు, మెరుపులతో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News