భైంసాలో ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతిచ్చింది. షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.;

Update: 2023-02-28 09:16 GMT

భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతిచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. తమ ర్యాలీకి అనుమతివ్వాలంటూ ఆర్ఎస్ఎస్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఈ విధంగా స్పందించింది.

షరతులతో కూడిన...
ర్యాలీలో కేవలం ఐదు వందల మంది మాత్రమే పాల్గొనాలని కూడా షరతు విధించింది. దీంతో పాటు ప్రార్థనాస్థలాలకు మూడు వందల మీటర్ల దూరంలో ర్యాలీ ఉండేలా చూసుకోవాలని చెప్పింది. ఎలాంటి ఘటనలు జరగకకుండా ర్యాలీని సజావుగా నిర్వహించుకోవాలని సూచించింది.


Tags:    

Similar News