సునీల్ కనుగోలుకు ఊరట
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది;
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో పోలీసుల విచారణకు సునీల్ కనుగోలు సహకరించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8న సునీల్ కనుగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని తెలిపింది. అయితే ఎలాంటి అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
విచారణకు సహకరించాలని...
కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసిన పోలీసులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పేజ్ పెట్టి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై పలువురిపై కేసు నమోదు చేశారు. అయితే తనకు జారీ చేసిన 41 సీఆర్పీసీ నోటీసులపై సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలను విన్న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.