నేడు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల కారణంగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.;

dussehra festival holidays
భారీ వర్షాల కారణంగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జనజీవనం స్థంభించిపోయింది. అనేక పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోజు కూడా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈరోజు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.
మూడు రోజుల నుంచి...
అదే సమయంలో అధికారులు ఎవరూ సెలవు పెట్టకూడదని తెలిపింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయి మొరాయించాయి. ఇక రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇరవై మందికి పైగానే వరదల కారణంగానా మృత్యువాత పడ్డారు. దీంతో ఈరోజు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.