Breaking : వారికి హైడ్రా కమిషనర్ వార్నింగ్
హైడ్రా కమిషనర్ రంగనాధ్ బిల్డర్లకు వార్నింగ్ ఇచ్చారు
హైడ్రా కమిషనర్ రంగనాధ్ బిల్డర్లకు వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా కూల్చివేసిన భవనాల వద్ద వ్యర్థాలను వెంటనే ఆ బిల్డరే తొలగించాలని తెలిపారు. అంతే తప్ప హైడ్రా వాటిని తొలగించదని చెప్పారు. భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించని వారిపై హైడ్రా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాధ్ హెచ్చరించారు.
ప్రభుత్వ అనుమతులున్న...
హైడ్రా తొలగించిన తర్వాత ఆ వ్యర్థాలను బిల్డరే తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే హైడ్రా ప్రభుత్వ అనుమతులున్న భవనాలను మాత్రం కూల్చివేయదని తెలిపారు. కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రంగనాధ్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులున్న భవనాల జోలికి వెళ్లదని తెలిపారు. ఇప్పటికే కొన్ని భవనాలకు నోటీసులు అందచేశామని రంగనాధ్ తెలిపారు. అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని హైడ్రా కమిషనర్ రంగనాధ్ కోరారు.