Telangana : RRR పూర్తయితే ఇక చాలా సమస్యలకు తెరపడినట్లే
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలయితే హైదరాబాద్ వాసులకు మరో వరం దక్కినట్లే
Regional Ring Road(RRR) Telangana:తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలయితే తెలంగాణ వాసులకు మరో వరం దక్కినట్లే. ఇప్పటికే ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగరవాసులకు ఊరటకల్గించే వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తొలగించేలా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి నప్పుుడు ఆయన నుంచి ఈ మేరకు హామీ లభించింది. తొలుత రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పరిధిలోకి వచ్చే చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్‌నగర్, సంగారెడ్డి మధ్య 182 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు నితిన్ గడ్కరీ సుముఖత వ్యక్తం చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రతిపాదనలను సిద్ధం చేసి...
ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. అయితే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అవరోధంగా ఉన్న విద్యుత్తు స్థంభాలు, భవనాల వంటి వాటిని తొలగించేందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించడంతో నితిన్ గడ్కరీ కూడా ఆ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, లేకుంటే రీజనల్ రింగ్ రోడ్డు లో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్ ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని నితిన్ గడ్కరీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ప్రధానమైన అడ్డంకి తొలగిపోయింది.
భూసేకరణను వెంటనే....
దీంతోనే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అయింది. అయితే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వెంటనే చేపట్టాలని కూడా సూచించడంతో త్వరలో పూర్తి చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు విజయవాడ - హైదరాబాద్ రహదారిని ఆరు లేన్లగా, హైదరాబాద్ - కల్వకుర్తి రహదారిని నాలుగు లేన్లగా విస్తరించాలని కూడా రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీనిపై తమకు ప్రతిపాదనలను పంపాలని కూడా ఆయన కోరారు. ఆర్ఆర్ఆర్ పూర్తయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు మరింత చెక్ పెట్టినట్లవుతుంది.