BIG Breaking : కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు!!

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలు అతిక్రమించారంటూ ఓటమి పాలయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2024-01-28 03:44 GMT

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలు అతిక్రమించారంటూ ఓటమి పాలయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 24 నియోజకవర్గాల్లో ముప్ఫయి పిటీషన్ల వరకూ హైకోర్టులో వేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ లో జరిగిన అవకతవకలతో పాటు అఫడవిట్ లో పొందుపర్చిన అంశాలపై కూడా అనేక మంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది. సిరిసిల్ల నియోజకవర్గంలో కెకె మహేందర్ రెడ్డి కూడా కేటీఆర్ పై పిటీషన్ వేశారు. 32 ఎకరాల భూమి కేటీఆర్ కొడుకు పేరు మీద ఉందని, అఫడవిట్ లో హిమాన్షు ఆస్తులను ప్రస్తావించలేదని మహేందర్ రెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు.

ఓట్ల లెక్కింపులో...
బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన చక్రధర్ గౌడ్ సిద్దిపేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పై పిటీషన్ వేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ గెలుపును ఛాలెంజ్ చేశారు. ఓట్ల లెక్కింపులో అనేక అవకతకవలు జరిగాయని ఆయన వేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. కూకట్‌పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై పిటీషన్ వేశారు. హుజూరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గెలుపుపై అభ్యంతరం తెలుపుతూ పిటీషన్ వేశారు.
అఫడవిట్ లో...
గద్వాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సరిత బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అఫడవిట్ లో అనేక అంశాలు పొందపర్చలేదని, ఖాళీగానే ఉంచారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆయనపై నమోదయిన కేసును కూడా ఈ అఫడవిట్ లో ప్రస్తావించలేదని తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాం నాయక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై పిటీషన్ దాఖలు చేశారు. అఫడవిట్ సరిగా వేయలేదని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయిన ఎన్నికల కమిషన్ పై పిటీషన్ వేశారు.
24 నియోజకవర్గాల్లో...
పటాన్ చెర్వులో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డిపై పిటీషన్ వేశారు. వీటితో పాటు ఆదిలాబాద్, కామారెడ్డి, షాద్ నగర్, మల్కాజ్‌గిరి, కొత్తగూడెం లలో కూడా అనేక పిటీషన్లు వేశారు. దీంతో మొత్తం 24 నియోజకవర్గాల్లో 30 పిటీషన్లు హైకోర్టులో వేశారు. దీనిపై హైకోర్టులో తర్వలో విచారణ జరిగే అవకాశముంది. ఇంత పెద్దయెత్తున ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారంటూ అఫడవిట్ తప్పుడు తడకలపైనే ఈ పిటీషన్లు దాఖలయ్యాయి.


Tags:    

Similar News