గ్రామంలో ఉన్న 20 శునకాలు కాల్చివేత

మహబూబ్ నగర్ జిల్లాలో వీధికుక్కలను కొందరు కాల్చి చంపిన ఘటన సంచలనం కలిగించింది;

Update: 2024-02-17 03:06 GMT
keynes,  stray dogs, four-year-old, ibrahimpatnam mandal
  • whatsapp icon

మహబూబ్ నగర్ జిల్లాలో వీధికుక్కలను కొందరు కాల్చి చంపిన ఘటన సంచలనం కలిగించింది. జిల్లాలోని అడ్డాకుల మండలం పొన్నకల్ లో గురువారం రాత్రి కొందరు వీధి కుక్కలను కాల్చి చంపిన ఘటన తెలిసింది. గ్రామంలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఉన్న దాదాపు ఇరవై శునకాలను నాటుతుపాకీతో కాల్చి చంపారు. అయితే వీటిని ఎందుకు చంపారన్నది మాత్రం మిస్టరీగానే మిగిలింది.

ఎవరు? ఎందుకు?
కుక్కలను నాటు తుపాకీతో కాల్చి చంపడంపై పోలీసులు విచారణ చేపట్టారు. పశువైద్య శాఖకు చెందిన అధికారులు కుక్కల శవాలకు పోస్టుమార్టం నిర్వహించారు. నమూనాలను సేకరించి హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అయితే ఈ కుక్కలను ఎవరు? ఎందుకు కాల్చి చంపారన్నది మాత్రం తెలియరాలేదు. పొన్నకల్ కార్యదర్శి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News