ED Raids: కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ ఇంట్లో ఈడీ సోదాలు

చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేకా ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి.;

Update: 2023-11-21 02:21 GMT

చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేకా ఇంట్లో  ఎన్‌ఫోర్స్‌మెంట్  అధికారుల సోదాలు జరుగుతున్నాయి. మంచిర్యాలలోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్‌, చెన్నూరులోనూ సోదాలు కొనసాగుతున్నాయి. వివేక్‌, వినోద్‌ ఇళ్లతోపాటు కూతురు ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే వివేక్‌ కంపెనీలకు చెందిన 8 కోట్ల రూపాయలు ఫ్రీజ్‌ అయ్యాయి. గతంలో వివేక్‌ కంపెనీ సిబ్బంది 50 లక్షలతో పట్టుబడ్డారు.

ఈ రోజు వేకువజాము నుంచి అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అయితే వివేక్‌ ఇంట్లో ఈడీ సోదాల సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చెన్నూరులోని ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. వారిని పోలీసులు అదుపు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

Tags:    

Similar News