ఈ నెల 25వరకూ అరెస్ట్ చేయొద్దు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది;
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అవినాష్ రెడ్డి మాత్రం సీబీఐ విచారణకు ఈ నెల 25వ తేదీ వరకూ సీబీఐ ఎదుట హాజరు కావాలని కూడా కోరింది. అవినాష్ రెడ్డి విచారణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
కస్టడీకి అనుమతి...
దీంతో సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డిని రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను తదుపరి విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని సీబీఐ వేసిన పిటిషన్ కు కోర్టు అనుమతిచ్చింది. ఆరు రోజుల కస్టడికి అనుమతిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈనెల 19 నుంచి 24 తేదీ వరకు అనుమతి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది.