అవినాష్‌ బెయిల్ : జూన్ 5కు వాయిదా

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జూన్ 5వ తేదీకి వాయిదా పడింది;

Update: 2023-04-28 11:21 GMT

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జూన్ 5వ తేదీకి వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్న కారణంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. రెండు వారాలైనా తదుపరి చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరుపున న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. తదుపరి చర్యలు సీీబీఐ తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకో్టు స్పష్టం చేసింది.

ఎందుకు ఈ వత్తిడి ..?
అత్యవసరం ఉంటే చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు మెన్షన్ చెసుకోవాలని తెలిపింది. హైకోర్టుకు రేపటి నుంచి వేసవి సెలవులు ఉండటంతో ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు అవినాష్ రెడ్డి తరుపున న్యాయవాది ఉంచారు. వెకేషన్ బెంచ్ ముందే మెన్షన్ చేసుకోవలని చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని చెప్పింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన తర్వాత ఎందుకు వత్తిడి చేస్తున్నారని ప్రశ్నించింది.


Tags:    

Similar News