సంచలన ఆరోపణలు చేసిన మొగిలయ్య
కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన పురస్కారం ఇంకా దక్కలేదని
కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన పురస్కారం ఇంకా దక్కలేదని చెప్పినట్లుగా ఆ వీడియో ఉంది. దీన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకుంటూ ఉన్నారని మొగిలయ్య ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. నా కళ కారణంగానే గుర్తింపు వచ్చిందని, బీజేపీ వారు నాతో మాట్లాడిన వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మొగిలయ్య.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలంతో పాటు రూ. కోటి అందాయా అని ఇటీవల ఓ రాజకీయ పార్టీ నేత మొగిలయ్యను అడిగాడు. ఇంకా అందలేదని, ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు ఇప్పించేందుకు కృషి చేస్తున్నారని మొగిలయ్య సమాధానమిచ్చారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం కూడా మొదలుపెట్టారు. మొగిలయ్య బుధవారం ఆ నాయకుడిని అచ్చంపేటలో రోడ్డుపైనే నిలదీశారు. తనకు రాష్ట్రప్రభుత్వం అండగా నిలిచిందని స్పష్టం చేశారు. ఓ పార్టీ నేతలు తనకు పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ఇచ్చిందంటున్నారని, అవసరమైతే దాన్ని వాపసు ఇచ్చేయడానికైనా సిద్ధమేనన్నారు. మీ రాజకీయాల కోసం నా నోట్లో మట్టి కొట్టవద్దని ఆయన కోరారు.
మొగిలయ్య అసలు పేరు దర్శనం మొగిలయ్య. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట అతని సొంతూరు. 12మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరి తరం కళాకారుడు. ఒకప్పుడు హైదరాబాద్‌లోని తుక్కుగూడలో భిక్షాటన చేస్తూ ఉండేవారు. ఆదరణ కోల్పోయిన కళతో భిక్షమెత్తుకుంటున్న ఆయన్ను చూసి భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడే అవకాశం దక్కింది. ప్రముఖ ఛానెళ్లు కూడా ఆయన్ను ఇంటర్వ్యూ చేయగా.. తన ఆర్థిక స్థోమత గురించి ప్రస్తావించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి రూ.2 లక్షల సాయం అందించారు. ఆ తర్వాత ఆయనకు సాయం చేయడానికి పలువురు ముందుకు వచ్చారు.