నాగర్ కర్నూలు జిల్లాలో మళ్లీ చిరుత కలకలం
నాగర్ కర్నూలులో చిరుత సంచారం కలకలం రేపుతుంది.
నాగర్ కర్నూలులో చిరుత సంచారం కలకలం రేపుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలోెని బిజినేపల్లి మండలం కేంద్ర సమీపంలో నిన్న రాత్రి మళ్లీ చిరుతపులి పశువులపై దాడి చేసింది. ఒక దూడను బలికొనింది. గ్రామంలో ఒక రైతు తన వ్యవసాయ పొలంలో పశువులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. అయితే తిరిగి వచ్చి చూడగా చిరుత దాడి చేసినట్లు కనుగొన్నాడు.
దూడను చంపి...
దూడ చనిపోయి ఉండటాన్ని గమనించిన రైతు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతదాడి కారణంగానే దూడ మరణించిందని నిర్ధారించారు. దీంతో ఈ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.