Chiranjeevi : రేవంత్ ను కలిసిన మెగాస్టార్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్యాదపూర్వకంగా కలిశారు;

Update: 2023-12-26 01:23 GMT
chiranjeevi, megastar,  revanth reddy, chief minister, chiranjeevi met chief minister revanth reddy, revanth news, political news, telangana, telangana news

chiranjeevi met chief minister revanth reddy

  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్యాదపూర్వకంగా తొలిసారి రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిసిన చిరంజీవి ముఖ్యమంత్రిగా ఎన్నికయినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. దీంతో పాటు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

చిత్ర పరిశ్రమ సమస్యలతో పాటు...
టాలీవుడ్ లో ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఇరువురు చర్చించుకున్నట్లు తెలిసింది. చిత్ర పరిశ్రమ కొత్త ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పగా, అదే సమయంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్ స్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చారని సమాచారం.


Full View


Tags:    

Similar News