నేటి నుంచి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే?

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2023-03-16 03:36 GMT

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఐదు రోజుల పాటు తెలంగాణలో ఈదురుగాలులతో పాటు వడగళ్ల వాన కూడా కురిసే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.

వర్షాలు ఇక్కడే....
ప్రధానంగా తెలంగాణలోని నిజామాబాద్, యాదాద్రి, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అల్లూరి సీతారామరాజు, విశాఖ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈ నెల 18న వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌ఘడ్ మీదుగా తెలంగాణ వరకూ ఏర్పడిన ద్రోణి కారణంగానే వర్షాలు కురవనున్నాయని తెలిపింది.


Tags:    

Similar News