Telangana : స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నెల 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది;
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నెల 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఉదయం 10.30 గంటలకు నూతన స్పీకర్ నియామకం జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక కోసం ఈ నెల 13వ తేదీ ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
అధికార పార్టీకి చెందిన...
అయితే అధికార పార్టీకి చెందిన వారే స్పీకర్ గా ఎన్నికయ్యే అవకాశముంది. 65 మంది శాసనసభ్యుల బలం ఉన్న అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక అధికార పార్టీ నేతనే స్పీకర్ గా ఎన్నికవుతారు. ఇప్పటికే సీనియర్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ పేరును పార్టీ పరిశీలిస్తుంది. ఎవరూ నామినేషన్ దాఖలు చేయకుంటే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయినట్లు ప్రకటిస్తారు. ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తేనే ఎన్నికను నిర్వహిస్తారు.