తెలంగాణలో బీజేపీ దే అధికారం : జేపీనడ్డా
తెలంగాణలో బీజేపీ అధికారంంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు
తెలంగాణలో బీజేపీ అధికారంంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసమే పనిచేస్తుందన్నారు. దేశంలో బీజేపీ పదమూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, మిత్రపక్షాలు ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని చెప్పారు. తెలంగాణ మార్పు బీజేపీ తోనే సాధ్యమని ఆయన అన్నారు.
ప్రాంతీయ పార్టీల సహకారంతోనే...
ప్రజల వికాసం కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ఎన్నికల హామీలను కాంగ్రెస్ ఎన్ని ఇచ్చినా ప్రజలు విశ్వసించరని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఎన్నికలకు తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని జేపీ నడ్డా తెలిపారు. ప్రజల వికాసం కోసమే బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ గెలుస్తుందని అన్న నడ్డ ఒంటరిగా ఎక్కడా గెలిచింది లేదని ఎద్దేవా చేశారు.