నేడు రోహిత్ రెడ్డి పిటీషన్ పై విచారణ
ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటీషన్ లో నలుగురిని రోహిత్ రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. కేంద్ర ప్రభుత్వం, ఈడీ, జాయింట్ డైరెక్టర్ ఈడీ, అసిస్టెంట్ డైరెక్టర్ పీఎంఎల్ఏ లను ప్రతివాదులుగా చేర్చారు.
క్వాష్ చేయాలని...
తనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈడీ విచారణకు పిలుస్తుందని రోహిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈసీఐఆర్ 48/2022 క్వాష్ చేయాలంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. హైకోర్టులో తన పిటీషన్ విచారణ ఉన్నందునే నిన్న రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు.