Telangana : నల్లగొండ డీసీసీబీ కాంగ్రెస్ కే
నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలో పడనుంది;
నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలో పడనుంది. నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. మొత్తం పదిహేను మంది డైరెక్టర్లు నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆయన పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.
త్వరలోనే ఎన్నిక...
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చక్రం తిప్పడంతో ఇది సాధ్యమయింది. దీంతో నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశముంది. త్వరలోనే డీసీసీబీ ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలతో పాటు డీసీసీబీలను కూడా కాంగ్రెస్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది.