Narendra Modi : నేడు మళ్లీ మోదీ ప్రధాని పర్యటన

‍ప్రధాని నరేంద్ర మోదీ నేడు మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ మధ్య కాలంలో వరసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.;

Update: 2024-05-10 02:07 GMT

‍ప్రధాని నరేంద్ర మోదీ నేడు మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ మధ్య కాలంలో వరసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణలో అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలందరూ తెలంగాణలోనే ఎక్కువగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో మరోసారి ఈరోజు పర్యటన చేస్తున్నారు.

నారాయణపేటలో జరిగే...
ఈరోజు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ నారాయణపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం ఎల్బీస్టేడియంలో జరిగే సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ప్రధాని సభకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


Tags:    

Similar News