11న హైదరాబాద్ కు మోదీ
ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు;
ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల పదో తేదీ నుంచి సెకండ్ యునైటెడ్ నేషన్స్ జియోస్పిటల్ ఇన్‌ఫర్‌మేషన్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ ఈ సదస్సు జరగనుంది.
సదస్సులో పాల్గొనేందుకు....
ఈ సదస్సులో పాల్గొనేందుకు అక్టోబరు 11వ తేదీన ప్రధాని మోదీ హాజరు కానున్నారు. హెచ్ఐసీసీ లో జరిగే ఐక్యారాజ్య సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆయన కేవలం అధికారిక కార్యక్రమాల్లోనే పాల్గొంటారని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.