జోరుగా సాగుతున్న యాత్ర
తెలంగాణలో తొమ్మిదో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. పఠాన్ చెర్వు పారిశ్రామిక వాడ నుంచి ఈరోజు ప్రారంభమైంది.;
తెలంగాణలో తొమ్మిదో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. పఠాన్ చెర్వు పారిశ్రామిక వాడ నుంచి ఈరోజు పాదయాత్ర ప్రారంభమైంది. మంచుకురుస్తున్నా ఉదయాన్నే రాహుల్ గాంధీ తన యాత్రను ప్రారంభించారు. ఈరోజు 24 కిలోమీటర్ల వరకూ పాదయాత్ర కొనసాగనుంది.
57వ రోజుకు...
కంది, పోతిరెడ్డిపల్లి మీదుగా సంగారెడ్డి వరకూ రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. రాహుల్ పాదయాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర నేటికి 57 రోజులకు చేరుకుంది. మంచి స్పందన లభిస్తుండటంతో రాహుల్ యాత్ర జోరుగా సాగుతుంది.