Breaking : గుడ్ న్యూస్...రేపటి నుంచి రైళ్ల రాకపోకల పునరుద్ధరణ

వరంగల్ జిల్లా ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు పూర్తయ్యాయి. రేపటి నుంచి రైళ్ల రాకపోకలు యధావిధంగా కొనసాగుతాయి;

Update: 2024-09-03 12:48 GMT
trains, continue, tomorrow,  south central railway

summer special trains from vizag

  • whatsapp icon

వరంగల్ జిల్లా ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు పూర్తయ్యాయి. రేపటి నుంచి రైళ్ల రాకపోకలు యధావిధంగా కొనసాగుతాయని దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం భారీ వర్షాలకు ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దానిని రైల్వే శాఖ శ్రమించి రెండు రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేశారు.

ట్రయల్ రన్ కూడా...
రైల్వే ట్రాక్ గాలిలో వేలాడుతుండటంతో రైల్వే అధికారులు, సిబ్బంది రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మాని శ్రమించి ఈ పనులు చేపట్టారు. విజయవాడ నుంచి వరంగల్ వైపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ట్రయల్ రన్ కూడా చేపట్టారు. అయితే కొత్తగా ట్రాక్ నిర్మించిన ప్రాంతంలో రైళ్లు నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.


Tags:    

Similar News