చల్లటి కబురు.. తెలంగాణకు మూడ్రోజులు వర్షసూచన

మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట్, నిజామాబాద్, అసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఇలా 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Update: 2022-04-04 12:57 GMT

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఠారెత్తే ఎండలు, ఉక్కపోతతో తెలంగాణ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణశాఖ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందించింది. రేపట్నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట్, నిజామాబాద్, అసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఇలా 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయ్యే అవకాశం ఉందని, 6-10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.


Tags:    

Similar News