కేసీఆర్ తో తేజస్వియాదవ్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ కలిశారు. జాతీయ రాజకీయాలపై వీరిరువురు చర్చించారు.;

Update: 2022-01-11 12:03 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ కలిశారు. జాతీయ రాజకీయాలపై వీరిరువురు చర్చించారు. తేజస్వియాదవ్ తో పాటు ఆర్జేడీ నేతలు సునీల్ సింగ్, బోళా సింగ్ యాదవ్ లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం...
రెండు రోజుల క్రితం సీపీఐ, సీపీఎం నేతలను కలసి జాతీయ రాజకీయాలపై చర్చించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం అన్ని పార్టీల నేతలను కలసి చర్చిస్తున్నారు. ఆర్జేడీ ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో ఉంది. అయితే కేసీఆర్ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ఉద్దేశం.


Tags:    

Similar News