Telanagana : తెలంగాణ వాసులకు షాకిచ్చిన ఆర్టీసీ.. అమాంతంగా ధరలు పెంచేసి

తెలంగాణలో ఆర్టీసీ ధరలు పెరిగాయి. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది

Update: 2024-06-12 12:32 GMT

తెలంగాణలో ఆర్టీసీ ధరలు పెరిగాయి. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. టోల్ గేట్లున్న మార్గాల్లో తిరిగే ప్రతి బస్సుల్లోనూ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇటీవల జాతీయ రహదారుల సంస్థ టోల్ గేట్ ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ధరలకంటే ఐదు శాతం వరకూ టోల్ ఛార్జీలను పెంచింది.

టోల్ ఛార్జీలను పెంచడంతో...
అయితే టోల్ ఛార్జీలను పెంచడంతో ఆర్టీసీ కూడా దీనిని అధిగమించేందుకు టోల్ గేట్ ఏరియాల్లో తిరిగే బస్సుల్లో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ పై మూడు రూపాయల వరకూ పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పది రూపాయల టిక్కెట్ పై పదమూడు రూాపాయలకు, డీలక్స్, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో పదమూడు రూపాయల నుంచి పదహారు రూపాయలకు, గరుడ ప్లస్ లో పథ్నాలుగు నుంచి పదిహేడు, నాన్ ఏపసీ స్లీపర్, హైబ్రిడ్స్ స్పీపర్ లో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలకు, ఏసీ స్లీపర్ లో ఇరవై నుంచి ఇరవై మూడు రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది.


Tags:    

Similar News