ఢిల్లీకి తెలంగాణ మంత్రులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షకు మద్దతుగా తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు

Update: 2023-03-09 12:57 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షకు మద్దతుగా తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేబినెట్ సమావేశం నుంచి మధ్యలోనే బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో దీక్షలో పాల్గొనేందుకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే వారు ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది.

రేపు దీక్షలో పాల్గొనేందుకు...
కల్వకుంట్ల కవిత రేపు జంతర్ మంతర్ వద్ద మహిళ రిజర్వేషన్ల అమలు కోరుతూ దీక్షకు దిగుతున్న సంగతి తెలిసిందే. రేపు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ముఖ్య సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. మహిళ రిజర్వేషన్ల అమలుపై డిమాండ్ కావడంతో మహిళ మంత్రులు వెళితే బాగుంటుందన్న సూచనలతో వారు హడావిడిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.


Tags:    

Similar News