నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై విచారణ
నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది;

నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీ ధర్మాసనంవిచారణ జరపనుంది. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై పిటిషన్ వేయడంతో దానిపై నేడు విచారణ జరగనుంది.స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన కౌశిక్ రెడ్డి, రిట్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ లు.
కాల వ్యవధిపై...
నిర్ణీత కాలవ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. గత విచారణ సందర్భంగా "తగిన సమయం" అంటే ఎంత అంటూ స్పీకర్ కార్యదర్శిని ప్రశ్నించిన ధర్మాసనం నాడు స్పీకర్‌ను అడిగి కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈరోజు విచారణలో "తగిన సమయం" అంటే ఎంత అన్నది తేల్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.