రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే చేయనున్నారు.

Update: 2022-07-16 04:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు రోడ్డు మ్యాప్ ను తయారు చేస్తున్నారు. కేసీఆర్ గోదావరి పరివాహక ప్రాంతంలో దెబ్బతిన్న పంటలను, నీట మునిగిన గ్రామాలతో పాటు ప్రాజెక్టులను కూడా పరిశీలించే అవకాశముంది. ఆయన వరద బాధితులతో కూడా మాట్లాడేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ బాధితులదో మాట్లాడాలన్నది ఇంకా నిర్ణయం కాకపోయినప్పటికీ, పునరావాస కేంద్రాల వద్ద బాధితులతో కేసీఆర్ మాట్లాడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ కూడా....
అయితే కేసీఆర్ ఏరియల్ సర్వేకు సంబంధించి ఇంకా రోడ్డు మ్యాప్ ఖరారు కాలేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా తలపిస్తున్నాయి. కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించి వచ్చిన తర్వాత పంట నష్ట పరిహారంపై కూడా ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ సయితం రేపు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. గవర్నర్ కొత్తగూడెం ప్రాంతంలోె పర్యటించే అవకాశముంది.


Tags:    

Similar News