Revanth Reddy : ఎమ్మెల్యేలకు టైం ఇచ్చిన రేవంత్
శానససభ్యులు తమ నియోజకవర్గాల సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం కేటాయించారు
telangana chief minister revanth reddy
శానససభ్యులు తమ నియోజకవర్గాల సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం కేటాయించారు. వారానికి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలకు అవకాశమిచ్చారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకూ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలిసేందుకు ప్రత్యేకంగా టైమ్ కేటాయించారు. దీంతో నియోజకవర్గాల సమస్యలు ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి, వాటిని పరిష్కరించుకునేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి కూడా కొంత వీలు చిక్కినట్లయింది.
26 నుంచి జిల్లాల పర్యటన...
దీంతో పాటు ఈ నెల 26వ తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. తొలి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలో ఉండనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో తొలి ప్రచార సభను రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఇంద్రవెల్లి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రవెల్లి స్మారక స్మృతి భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.