Revanth Reddy : నేడు కూడా రేవంత్ ఢిల్లీలో బిజీ బీజీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు

Update: 2024-12-13 04:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నిన్నపలువురు కేంద్ర మంత్రులను కలిసిన రేవంత్ రెడ్డి పలు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల గురించి చర్చించారు. నిన్న ధర్మేంద్ర ప్రదాన్ తో పాటు నితిన్ గడ్కరీ తో పాటు మరికొందరు నేతలను రేవంత్ రెడ్డి కలిశారు. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు.

మంత్రి వర్గ విస్తరణపై...
కేంద్ర మంత్రులతో పాటు పార్టీ పెద్దలను కూడా కలసి మంత్రి వర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుండటంతో పూర్తి స్థాయి మంత్రి వర్గం లేని కారణంగా విస్తరణకు అనుమతి ఇవ్వాలని రేవంత్ పార్టీ నేతలను కోరనున్నారు. ఆశావహులు ఇప్పటికే ఢిల్లీచేరుకుని తమ ప్రయత్నాలను మొదలు పెట్టారు.


Tags:    

Similar News