కేరళకు బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ కు బయలుదేరి వెళ్లారు. రేపు వాయనాడ్ లో ప్రియాంక గాంధీ నామినేషన్ వేయనున్నారు;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ కు బయలుదేరి వెళ్లారు. రేపు వాయనాడ్ లో ప్రియాంక గాంధీ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన ఈరోజు కేరళకు బయలుదేరి వెళ్లారు. రేపు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
రాహుల్ రాజీనామాతో...
రాహుల్ గాంధీ వాయనాడ్, రాయబరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందడంతో వాయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని నిర్ణయించింది. రేపు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలు హాజరు కానున్నారు.