కీరవాణికి నేను అప్పగించలేదే : రేవంత్ రెడ్డి
రాష్ట్ర గీతాన్ని స్వరపరిచే విషయం అందెశ్రీకి అప్పగించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
రాష్ట్ర గీతాన్ని స్వరపరిచే విషయం అందెశ్రీకి అప్పగించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని తెలిపారు. ఎవరితో సంగీతం చేయించుకోవలనేది అందే శ్రీ నిర్ణయానికే వదిలేశామని చెప్పారు.
పాట రూపకల్పన బాధ్యత...
జయజయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీ కే పాట రూపకల్పన బాధ్యతలు ఇచ్చామని తెలిపారు. అందెశ్రీయే కీరవాణిని ఎంపిక చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్ర లేదన్న రేవంత్ రెడ్డి రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం రూపొందించాలని నిర్ణయించామని తెలిపారు. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని, సమ్మక్క, సారక్క - నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందని చెప్పారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం రూపొందిస్తామని తెలిపారు.