Revanth Reddy : జపాన్ పర్యటనకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెలలో జపాన్ లో పర్యటించనున్నారు;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెలలో జపాన్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేశారు. వారం రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లోనే ఉండనున్నారు. ఒసాకాలో జరగనున్న ఇండ్రస్ట్రియల్ ఎక్స్ లో ఆయన పాల్గొంటున్నారు. దీంతో పాటు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు తేవడానికి ముఖ్యమంత్రి జపాన్ పర్యటన ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పెట్టుబడుల కోసం...
దావోస్ పర్యటనతో పెట్టుబడులు వెల్లువెత్తాయని, అదే సమయంలో జపాన్ పర్యటనలో కూడా అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ కంపెనీల సీఈవోలు, అధిపతులతో ఆయన సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.