నేడు ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ
సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు ఇవాళ విచారణకు రానుంది.;

సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు ఇవాళ విచారణకు రానుంది. గత ఎన్నికల్లో గెలిచిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయలంటూ బీఆర్ఎస్ వేసిన పిటీషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయస్థానం స్పీకర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది
తాము పార్టీ మారలేదంటూ...
అయితే తాము ఏ పార్టీలోకి మారలేదని తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని ఎమ్మెల్యేలు కూడా పిటీషన్ వేశారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారకముందే, సుప్రీంకోర్టులో స్పీకర్ నిర్ణయం ఎప్పుడంటూ ప్రశ్నిస్తుండటంతో కొంత పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. అందుకే తాము పార్టీ మారలేదని చెప్పాల్సి వచ్చింది.