తెలంగాణలో కనిష్టానికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. మరో మూడ్రోజులు ఇంతే !

ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ;

Update: 2022-01-30 10:57 GMT
cold waves, adilabad, telangana
  • whatsapp icon

తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో అతిశీతల వాతావరణం నెలకొంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 8 డిగ్రీల కనిష్టస్థాయికి పడిపోతున్నాయి. ఉత్తర భారతంలో అతిశీతల వాతావరణ ప్రభావం, హిమాలయాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తోన్న గాలుల కారణంగా తెలంగాణలో చలితీవ్రత పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Also Read : తగ్గనున్న దిగుమతులు.. పెరగనున్న వంటనూనెల ధరలు
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ చలి తీవ్రతరమవుతోంది. రానున్న మూడ్రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ఇలాగే ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఉదయం 11 గంటలైనా చలితీవ్రత తగ్గకపోవడంతో.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఆర్లి(టీ) గ్రామంలో అత్యల్పంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.







Tags:    

Similar News