తెలంగాణలో స్కూళ్లకు పదిహేను రోజులు సెలవులు

తెలంగాణలో విద్యాసంస్థలకు పదిహేను రోజుల పాటు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2022-09-13 06:17 GMT

తెలంగాణలో విద్యాసంస్థలకు పదిహేను రోజుల పాటు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. విద్యాసంస్థలకు పదిహేను రోజులు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. దసరా పండగ సందర్భంగా ప్రభుత్వం ఈ సెలవులను ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నె 8వ తేదీ వరకూ ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చింది.

దసరా పండగకు....
తిరిగి అక్టోబరు 10 వ తేదీన విద్యాసంస్థలు ప్రారంభమవుతాయి. తెలంగాణలో దసరా పండగను అతి పెద్ద పండగగా చేసుకుంటారు. ప్రతి ఏటా దసరా పండగకు ఎక్కువ రోజులు సెలవులను ప్రకటించడం సంప్రదాయంగా వస్తుంది. ప్రభుత్వం పదమూడు రోజుల పాటు మాత్రమే సెలవులు ఇచ్చినా, శని, ఆదివారాలు కలిపి మొత్తం పదిహేను రోజుల పాటు విద్యాసంస్థలు తెలంగాణలో తెరుచుకోవు.


Tags:    

Similar News