తెలంగాణ కుంభమేళాకు ఏర్పాట్లు

తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకూ మేడారం జాతర జరగనుంది

Update: 2021-12-23 03:50 GMT

తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకూ మేడారం జాతర జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా మేడారం జాతరకు పేరుంది. సమ్మక్క - సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులు తీర్చుకుంటారు. అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు.

ప్రత్యేక బస్సులు....
ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక నిధులను కూడా కేటాయిస్తుంది. సమ్మక్క, సారలమ్మ జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది. మొత్తం 3,845 బస్సులను ప్రత్యేకంగా ఈ జాతర కోసం ఏర్పాటు చేసింది. దీంతో పాటు మేడారంలో యాభై ఎకరాల్లో బస్టాండ్ ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కోవిడ్ నిబంధనలను అనుసరించి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News