Telangana : ప్రయాణికులకు తీపికబురు చెప్పిన ఆర్టీసీ.. ఇంటివద్దకే

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పికప్ వ్యాన్ లు ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది;

Update: 2024-12-07 08:01 GMT
telangana rtc, good news,  passengers, pickup vans
  • whatsapp icon

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పికప్ వ్యాన్ లు ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు నిన్నటి నుచే హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం పికప్ వ్యాన్ లను ఏర్పాటు చేసింది. తొలి విడత ఈసీఐఎల్, ఎల్బీనగర్ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్ వ్యాన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

పికప్ వ్యాన్ లు...
హైదరాబాద్ నుంచి నిత్యం దూరప్రాంతాలైన విశాఖ, విజయవాడ
, రాజమండ్రి, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు వెళ్లే వారికి కోసం ఈ పికప్ వ్యాన్ లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ పికప్ వ్యాన్ లు కాప్రా మున్సిపల్ కాంప్లెక్స్, మౌలాలీ హెచ్ బి కాలనీ, మల్లాపూర్, హెచ్ఎంటీ నగర్, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్, నాగోలో, సుప్రజ ఆసుపత్రి, ఎల్పీనగర్ ఎల్.పి.టి మార్కెట్ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. పికప్ వ్యాన్ ల కోసం 040-23450033, 040-69,440000 నెంబర్లకు కాల్ చేయవచ్చని సూచించింది. ఇక శీతాకాలం కావడంతో ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి పది శాతం రాయితీని కూడా ప్రకటించింది.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News