తెలంగాణలో రాజకీయ జాతర.. రాష్ట్రాన్ని చుట్టేయనున్న బడా నేతలు

తెలంగాణలో రాజకీయ జాతర కొనసాగుతోంది. అలాగే పొలిటికల్ జాతరలోనూ చుట్టాలు క్యూకడుతున్నారు. చుట్టాలు అంటే..

Update: 2023-10-25 01:33 GMT

-- తెలంగాణకు క్యూకడుతున్న బీజేపీ అగ్రనేతలు

-- ఈనెల 27న సూర్యాపేటలో అమిత్‌షా బహిరంగ సభ

-- రాష్ట్రంలో పర్యటించనున్న అమిత్ షా, జేపీ నడ్డా

-- మొత్తం 15కు పైగా సభల్లో పాల్గోననున్న ఇద్దరు నేతలు

-- 5 నుంచి 10 సభలకు మోడీ రాక

-- కీలక షెడ్యూల్‌ రెడీ చేస్తున్న కమలం

తెలంగాణలో రాజకీయ జాతర కొనసాగుతోంది. అలాగే పొలిటికల్ జాతరలోనూ చుట్టాలు క్యూకడుతున్నారు. చుట్టాలు అంటే ఇంటికి వచ్చే చుట్టాలు కదండోయ్‌.. ఢిల్లీ నేతలు రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు. తెలంగాణ ఎన్నికల మహాసంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు జాతీయస్థాయి నేతలు ఒకరివెంట ఒకరు రాష్ట్రం బాట పడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు తమదైన శైలిలో ప్రచారానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ నేతల రాక షెడ్యూల్ పరిశీలిస్తే.. ఎన్నికల సందర్భంగా తెలంగాణ బాట పట్టబోతున్నారు బీజేపీ అగ్రనేతలు.అమిత్‌షా, నడ్డాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా బహిరంగ సభల్లో పాల్గొనేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. నవంబర్‌ 20లోపు మొత్తం 15కి పైగా సభల్లో ఇద్దరు నేతలు పాల్గొనబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఒక్క మోదీనే ఐదు నుంచి 10సభల్లో పాల్గొనేలా షెడ్యూల్‌ ఫిక్స్ చేస్తున్నారు నేతలు. అగ్రనేతల సభల్లో ప్రకటన కోసం మేనిఫెస్టోపైనా కసరత్తు చేస్తోంది బీజేపీ.

ఇక టూర్ల వ్యవహారం పక్కన పెడితే బీజేపీలో జరుగుతున్న మరొకటి ఏంటంటే అభ్యర్థుల జాబితాపై కసరత్తు, అసంతృప్తుల బుజ్జగింపులు. తొలి జాబితా తర్వాత రోజురోజుకీ పెరుగుతున్న అసంతృప్తుల లిస్ట్ పెరుగుతోంది. బండి సంజయ్‌, వివేక్‌లో కూడా కొంతమేర అసంతృప్తి ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే తనవాళ్లకు టిక్కెట్లు ఇప్పించుకోలేకపోయానన్న ఆవేదనలో బండి సంజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తనతో చర్చలే జరపలేదంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు మాజీ ఎంపీ వివేక్.

ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలతో విడివిడిగా భేటీకాబోతున్నారు అమిత్ షా. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సభ పెట్టడంతో పార్టీలో టెన్షన్‌ మొదలైంది. రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో ఉంటారో లేదోనన్నది బీజేపీలో ఆందోళన కలిగించే అంశం. ఇలా బీజేపీలో బడా నేతలు తెలంగాణ వైపు చూస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు మరింతగా వెడేక్కే అవకాశం ఉంది. ఎలాగైన సరే ఈ సారి రాష్ట్ర పగ్గాలు చేతబట్టి పాలనను పరుగెత్తించాలన్న కసితో ఉంది.

Tags:    

Similar News