నేడు ఈడీ ఎదుటకు పైలట్ రోహిత్ రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నారు. మనీలాండరింగ్ కేసులో ఆయనను విచారించనున్నారు. ఇప్పటికే తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ కార్యాలయం నుంచి రోహిత్ రెడ్డికి నోటీసులు అందాయి. తన వ్యాపారాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు కోరినట్లు రోహిత్ రెడ్డి చెబుతున్నారు.
ఆస్తుల వివరాలతో...
దీంతో అన్ని వివరాలతో ఈడీ ఎదుటకు పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరు కానున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ఫాం హౌస్ లోనే డీల్ జరగడంతో ఆయన బీజేపీకి టార్గెట్ అయ్యారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం రోహిత్ రెడ్డికి సంబంధించి అనేక కేసులున్నాయని, అందులో దేనికి ఈడీ అధికారులు పిలచారో చూడాల్సి ఉందని అంటున్నారు.