బీజేపీ పై కవిత ఫైర్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.;

Update: 2022-09-07 08:31 GMT

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రులకు పది లక్షల కోట్ల రూపాయలను పంచి పెట్టారని ఆమె ఆరోపించారు. పేదలకు అందించే ఉచిత పథకాలను తొలగించాలని కుట్రను బీజేపీ చేస్తుందన్నారు.

టీఆర్ఎస్ ను ఆగం చేసే కుట్ర...
ఆర్థిక మంత్రి నిర్మల రేషన్ షాపునకు వెళ్లి మోదీ ఫొటోపై కలెక్టర్ తో గొడవకు దిగారన్నారు. ఎక్కడైనా రేషన్ షాపులో ప్రధాని ఫొటోలు పెడతారా? అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఆగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కానీ ప్రజలు అండ ఉన్నంత కాలం టీఆర్ఎస్ ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఎవరూ నమ్మరని కవిత అన్నారు. బీజేపీని తరిమికొట్టే కాలం ఎంతోదూరం లేదని ఆమె అన్నారు. మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.


Tags:    

Similar News