ఎమ్మెల్యేల కొనుగోలుపై కేటీఆర్ ట్వీట్
ఎమ్మెల్యేల కొనుగోలుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు;
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లోనే ఉన్నారు. కేసీఆర్ వారితో దఫాలుగా మాట్లాడుతున్నారని, వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎవరూ మాట్లాడవద్దని ఆయన కోరారు.
పట్టించుకోవద్దు...
అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతారని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసు ప్రాధమికంగా విచారణ దశలో ఉందని, ఎవరూ దీనిపై మాట్లాడవద్దని ఆయన కోరారు. దొరికిన దొంగలు మాట్లాడిన మాటలను పార్టీ శ్రేణులను ఎవరూ పట్టించుకోవద్దని ఆయన కోరరారు. ఆ అవసరం కూడా లేదన్నారు.