ధాన్యం సేకరణకు గ్రీన్ సిగ్నల్

ధాన్యం సేకరణపై ఎఫ్‌సీఐ తెలంగాణకు క్లియరెన్స్ ఇస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ధాన్యం సేకరణ జరుపుతామన్నారు

Update: 2022-07-20 13:04 GMT

తెలంగాణలో థాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. ధాన్యం సేకరణపై ఎఫ్‌సీఐ తెలంగాణకు క్లియరెన్స్ ఇస్తుందని చెప్పారు. ధాన్యం సేకరణ జరుపుతామని పియూష్ గోయల్ తెలిపారు. డైరెక్టుగా ఎఫ్‌సీఐ నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఎఫ్‌సీఐ ఖచ్చితంగా ధాన్యం తెలంగాణలో కొనుగోలు చేస్తుందని, రైతు ప్రయోజనాలే తమకు ముఖ్యమని పియూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, కిషన్ రెడ్డి మాట్లాడారు.

ఎక్కడా లేని సమస్య...
ఏ రాష్ట్రంలోనూ లేని సమస్యలు తెలంగాణలో వస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రజలు నష్టపోతున్నారన్నారు. పోషకవిలువలున్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి తాము విజ్ఞప్తి చేశామని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. రైతులు, రైస్ మిల్లర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తాము భయపడి పారిపోమని, చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


Tags:    

Similar News