ఏబీపై చర్యలకు సిద్ధమయిన సర్కార్

మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమ శిక్షణా చర్యలకు ప్రభుత్వం సిద్ధమయింది.. ఐపీఎస్‌గా ఉంటూ ప్రభుత్వం ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఏబీ వెంకటేశ్వరరావు చేసినే వ్యాఖ్యలు [more]

Update: 2021-04-19 01:21 GMT

మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమ శిక్షణా చర్యలకు ప్రభుత్వం సిద్ధమయింది.. ఐపీఎస్‌గా ఉంటూ ప్రభుత్వం ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఏబీ వెంకటేశ్వరరావు చేసినే వ్యాఖ్యలు చేశారని అభియోగం దాఖలు చేసింది. కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు చేసిన కామెంట్లని జగన్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. 30 రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిఘా పరికరాల కొనుగోళ్లల్లో అవకతవకల అభియోగంపై ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌లో ఉన్నారు. సర్వీస్ నిబంధనలకుకు వ్యతిరేకంగా వ్యవహరించారని మరోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Tags:    

Similar News