ప్రమాణానికి వైసీపీ నేతలు సిద్ధమేనా?

తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలున్నాయని భావించే వైసీపీ అరాచకాలకు దిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలను రద్దు [more]

Update: 2021-04-20 00:46 GMT

తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలున్నాయని భావించే వైసీపీ అరాచకాలకు దిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలను రద్దు చేయాలని తాము తొలి నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. దొంగ ఓట్లు వేయలేదని తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా వైసీపీ నేతలు ప్రమాణం చేస్తారా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీ సయతం అధికార పార్టీకి అనుకూలంగా మరారని, అందుకే దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని అరెస్ట్ చేయలేదని అచ్చెన్నాయుడు అన్నారు. తాము తిరుపతి ఎన్నికను రద్దు చేయాలని కోరినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదని, తాము న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామన అచ్చెన్నాయుడు తెలిపారు.

Tags:    

Similar News