జగన్ వెంటనే రాజీనామా చేసి దిగిపోవాల్సిందే
కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ వెంటనే రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ [more]
కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ వెంటనే రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ [more]
కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ వెంటనే రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నిరక్షరాస్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కరోనా నుంచి ఏపీ ప్రజలను కాపాడేవారని, జగన్ మాత్రం పూర్తిగా పాలనను గాలికి వదిలేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలను చూసి జగన్ నేర్చుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. కేసుల భయంతోనే ప్రధాని మోదీని జగన్ పొగుడుతున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. కేసులు పెట్టాల్సింది చంద్రబాబుపై కాదని, ప్రజల మరణాలకు కారణమవుతున్న జగన్ పై కేసులు పెట్టాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.